పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం చిలకవారిపాలెం వద్ద రెండు అతిపెద్ద కొండచిలువలను పట్టుకున్నారు. గ్రామసమీపంలోని పొలాల్లో వారం రోజులుగా తిరుగుతుండటంతో ప్రజలు స్నేక్ సేవర్ సొసైటీకి సమాచారం అందించారు. అటవీశాఖ, స్నేక్ సేవర్ సొసైటీ అధ్వర్యంలో రెండు కొండచిలువలను పట్టుకొని.. అలివేరు అటవీ ప్రాంతంలో వదిలేశారు.
పాములను చంపకండి..
ఒక కొండచిలువ 15 అడుగులు.. మరొకటి 12 అడుగుల పొడవు ఉన్నాయి. ఇవి ఒకటి ఆడ, మరొకటి మగది కావడం వల్ల కలిసి తిరుగుతునట్లు స్నేక్ సేవర్ సొసైటీ సభ్యుడు క్రాంతి తెలిపారు. పాములు పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తాయని.. వాటిని చంపకుండా ప్రజలు తమకు సమాచారం అందించాలని సూచించారు. జనావాసాల మధ్య తిరిగే వాటిని పట్టుకొని అటవీప్రాంతంలో వదులిపెడతామని తెలిపారు.
ఇదీ చదవండి: