పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి బెంగళూరు వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా చెట్టు పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.
బొబ్బిలికి చెందిన మేడి శ్రీనివాస్, భార్య గాయత్రి, కుమార్తె హర్షికలతో పాటు శ్రీనివాస్ సోదరుడు రామకృష్ణ కారులో ప్రయాణిస్తున్నారు. చెట్టుకొమ్మ కారు అద్దాలను ధ్వంసం చేసి.. లోపలికి వెళ్లి.. అందులో ఉన్న వారిని గాయపరిచింది. బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: