ETV Bharat / state

ఏలూరులోనూ విశాఖ తరహా విషాద పరిస్థితులు

విశాఖ గ్యాస్‌ లీకేజీ దృశ్యాలే ఏలూరులోనూ కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగిపోతుండడం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలబడటంలాంటి సంఘటనలు ఏలూరులోని పది ప్రాంతాల్లో కనిపించాయి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
author img

By

Published : Dec 7, 2020, 5:26 AM IST

Updated : Dec 7, 2020, 6:45 AM IST

చిత్రంగా విశాఖ గ్యాస్‌ లీకేజీ దృశ్యాలే ఏలూరులోనూ కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగిపోతుండడం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలబడటంలాంటి సంఘటనలు ఏలూరులోని పది ప్రాంతాల్లో కనిపించాయి. మోటారుసైకిల్‌ను నడుపుతున్నప్పుడు ఓ యువకుడు పడిపోయాడు. ఓ వివాహిత ఇంట్లోనే అందరితో మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి కొద్దిసేపు అపస్మారకంలోకి చేరుకుంది. ఆరేళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి దేవాలయానికి వెళ్లగా అక్కడే స్పృహ తప్పింది. మరో వ్యక్తి ఇంట్లోనే ఎవరూ లేనందున వంట చేస్తూ స్టవ్‌ వద్ద కళ్లు తిరిగిపడిపోయాడు. ఇంకో వృద్ధురాలు కూడా వంట చేస్తున్నప్పుడు స్పృహ తప్పింది.

ఒకే కుటుంబంలో నలుగురైదుగురు ఉంటే ఒకరు, పలుచోట్ల ఇద్దరు ఈ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్‌ సంఘటనలో వాయు కాలుష్యం వల్ల బాధితులు ఆసుపత్రుల్లో చేరారని వైద్యులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. దృశ్యాలు మాత్రం ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అంబులెన్సులు, ఆటోలు, ఇతర వాహనాలతో ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి రద్దీగా కనిపించింది. వాహనాల నుంచి బాధితులు రాగానే...అక్కడ సిద్ధంగా ఉన్న సిబ్బంది స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లలో క్యాజువాలిటీ వార్డుల్లోకి తరలిస్తున్నారు.

కాసేపేమీ అర్థం కాలేదు..

నాకు 20 రోజుల కిందట శస్త్రచికిత్స జరిగింది. ఆదివారం మధ్యాహ్నం అందరితో మాట్లాడుతుండగానే కాసేపు ఏమీ అర్థం కాని పరిస్థితి. కాసేపటి తరువాత తేరుకున్నా. అయినా చికిత్స చేయించుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఆసుపత్రికి వచ్చా. కాస్త నీరసంగా ఉంది. ఆపరేషన్‌కు సంబంధించి ఏమైనా తిరగపెట్టిందేమోనని భయపడ్డా.

- ఉషాకుమారి

బిగదీసుకుపోయింది

మా కోడలు ఉషాకుమారి(32) ఉన్నట్టుండి బిగదీసుకుపోయింది. నోట మాట కూడా రాలేదు. 10 నిమిషాల తర్వాత మళ్లీ మామూలు మనిషి అయింది. ఏమైందో అర్థం కాలేదు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యులు చికిత్స చేశారు.

- బ్రహ్మయ్య, తూర్పువీధి

బైక్‌పై నుంచి కిందపడ్డా

నేను ఆర్‌ఆర్‌పేటలో వాలంటీరును. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలప్పుడు ద్విచక్ర వాహనంపై వస్తున్నా. ఇంటి సమీపానికి చేరేసరికి ఒక్కసారిగా బండిపై నుంచి కింద పడ్డా. తర్వాత ఏమైందో తెలియదు. తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నా. బైకుపై నుంచి పడటంతో చిన్న, చిన్న దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం, నీరసం, నడుం నొప్పి ఉన్నాయి.

- ఖాదర్‌, ఆర్‌ఆర్‌పేట

గుడికి వెళ్లేలోపే

మాది గుబ్బలవారి వీధి. నేను, నా భర్త, ఆరేళ్ల పాప ఉదయం బైకుపై చిన్నవెంకన్న దర్శనానికి ద్వారకాతిరుమల బయర్దేరాం. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నాం. బైకు దిగగానే పాప కిందపడిపోయింది. గుడిలోకి వెళ్లకుండానే వెనుదిరిగి, అమ్మాయిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాం. చికిత్స చేశాక ఆరోగ్యం మెరుగైంది.

- కరుణ, బాధితురాలి తల్లి

వంట చేస్తూ పడిపోయా...

నా వయసు 70 ఏళ్లు. ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. ఆదివారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్నా. వంట చేస్తుండగా హఠాత్తుగా కళ్లు తిరిగినట్లు అనిపించి, కుప్పకూలిపోయా. ఇరుగుపొరుగు వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వచ్చేవరకూ ఏం జరిగిందో తెలియదు.

- రత్నమాణిక్యం,

ఇదీ చదవండి:

ఏలూరు బాధితుల్లో వింత ప్రవర్తన... ఆందోళనలో నగరవాసులు

Last Updated : Dec 7, 2020, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.