ETV Bharat / state

పులి సంచారం.. భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు - పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పులి సంచారం

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారంతో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థులను అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

tiger roaming
పులి సంచారం
author img

By

Published : Dec 27, 2020, 7:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. కుక్కునూరు అటవీ రేంజ్ పరిధిలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. వేలేరుపాడు మండలంలోని కోయదా, కట్కూరు, ఎడవల్లి, బోలపల్లి, ఏర్రతోగు అటవీ ప్రాంతంలో పులి తిరిగిన జాడలు కనిపించాయి. పులి సంచారంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

tiger roaming
అధికారులు గుర్తించిన పులి పాదాలు

కావడిగుండ్ల అడవుల్లో పులి చంపి తిన్న పశువుల కళేబరాలను గుర్తించారు. కళేబరాల వద్ద పాదముద్రలు పులివిగా అధికారులు నిర్ధారించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా ప్రజలు పశువులు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్తుంటారు. ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: సజ్జల నన్ను హత్యచేయించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.