పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ అపార్టుమెంటులోని నాలుగో అంతస్తు నుంచి జారిపడి లక్ష్మీపతిరావు అనే వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాధితుడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.