సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును నేడు సందర్శించనుంది. మధ్యాహ్నం ఈ బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులను ఈ బృందం పరిశీలించనుంది.
కాపర్ డ్యామ్‌ల నిర్మాణాల పై గోదావరి వరదల ఉధృతి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై వీరు అధ్యయనం చేయనున్నారు. మూడు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులో వీరు పర్యటించనున్నారు. కాపర్ డ్యాంల నిర్మాణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఈ బృందం దిశానిర్దేశం చేస్తారు.
ఇదీ చదవండి: