TDP MLA cycle yatra: టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శుక్రవారం సైకిల్ యాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి అమరావతిలోని అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లారు. 90 శాతం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో.. మూడేళ్లుగా వారంతా ఏడాదికి రూ.50 వేల వరకు అద్దెలు చెల్లించి నష్టపోయారన్నారు. గృహాల్లో మిగిలిపోయిన 10 శాతం పనులు పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. అవేమీ పట్టించుకోకుండా పార్టీ రంగులు వేసుకోవడం బాధాకరమన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు రామానాయుడు స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే వరకు తెదేపా తరఫున నిరంతర పోరాటం చేస్తామని చెప్పారు.
వివేకా హత్య వెనుక పెద్ద నాయకుల ప్రమేయం ఉంది: వివేకా బావమరిది