ETV Bharat / state

"దేవాలయాలకు భద్రత లేకుండా పోయింది" - పశ్చిమగోదావరిజిల్లా తాజా వార్తలు

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. హిందూ దేవాలయాలకు భద్రత లేకుండా పోయిందని తెదేపా నేతలు ఆరోపించారు. దేవాలయాలు, అర్చకులపై జరుగుతున్న దాడులను తెదేపా పై నెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. విమర్శించారు.

TDP leader  Pattabhiram
హిందూ దేవాలయాలకు భద్రత లేకుండా పోయింది
author img

By

Published : Jan 20, 2021, 10:12 AM IST

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు తెదేపా కార్యాలయంలో బ్రహ్మణ కార్పొరేషన్ వేమూరి ఆనంద్ సూర్య నిరసన దీక్ష చేపట్టారు. దేవాలయాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. హిందూ దేవాలయాలు, అర్చకులు, పూజరులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. ఈ నిరసన దీక్షను తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి విరమింపచేశారు. గత ప్రభుత్వంలో అన్ని మతాలకు తగిన గౌరవం దక్కేదని ప్రస్తుతం మతాల మధ్య చిచ్చుపెట్టి ఓటుబ్యాంకును పెంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విదేశాల నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి.. మతమార్పిడులు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు.. వేమూరి దీక్షకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైతం హాజరై సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక... రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని రవీంద్ర అన్నారు. ఈ దాడులను తెదేపాపై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని.. అసలైన దోషులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.