ఈ నెల 14వ తేదీన హత్యకు గురైన అంజలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ టీ.సీ.హెచ్. ఆర్ పాలెంతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పశ్చిమగోదావరిలోని లింగపాలెంలో చెవిదిద్దుల కోసం 8 ఏళ్ల చిన్నారిని చంపిన వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
టీ.సీ.హెచ్.ఆర్ పాలెంకు చెందిన బన్ను అలియాస్ వంశీ అనే యువకుడు.. క్రికెట్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేశాడు. అవి తీర్చేందుకు అంజలి చెవులకున్న బంగారు దిద్దులు కాజేయాలని నిర్ణయిుంచుకున్నాడు. గ్రామ శివారులో ఉన్న పాత రేకుల షెడ్డులోకి బాలికను తీసుకువెళ్లాడు. దిద్దులు తీస్తుండగా చిన్నారి కేకలు వేయడంతో.. ముఖంపై దిండుతో నొక్కి కిరాతకంగా హతమార్చాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి: