తణుకు పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. కరోనా వైరస్ కారణంగా జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. కార్మికులు రేయింబవళ్లు పనిచేశారు. వీరి సేవలను గుర్తించిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. శాలువాతో సత్కరించారు. మాస్క్లు, శానిటైజర్లు, పళ్లు, కూరగాయలు అందించారు. ఇదే రీతిలో సేవలందించి కరోనా బారి నుంచి ప్రజలను రక్షించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: