పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపత్రికి చెందిన నరసింహరావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే తాను పురుగుమందు తాగినట్లు చికిత్స సమయంలో చెప్పిన మాటలను బంధువులు రికార్డ్ చేశారు. నరసింహరావు, అతడి భార్య దుర్గాదేవికి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు ఉన్నాయి. భర్తపై పోలీసులకు వారం రోజుల కిందట భార్య ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు నరసింహరావును స్టేషన్కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు బంధువులకు తెలిపాడు. పోలీసులు కొట్టి అవమానించడం కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. నరసింహరావును ఏలూరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతిచెందాడు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య