పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య కృష్ణా జిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి పాఠశాల ప్రాంగణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ట్యూషన్‌కు వెళ్లిన దీపక్ తెల్లవారేసరికి మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ సాయి మొబైల్ ద్వారా చిన్న చిన్న లఘు చిత్రాలు తీసేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీపక్ చాలా బాగా చదివే వాడని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. స్కూల్లో నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవీ చదవండి:
తిరుమలలో ఎర్రచందనం కూలీల అరెస్ట్