పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 200 మంది విద్యార్థులు శిక్షణ నిమిత్తం వెళ్లి షోలాపూర్‌లో చిక్కుకుపోయారు. వారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి సంరక్షిస్తున్నా.. అంతా ఒకే గదిలో ఉండాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఇకనైన తమ సొంత రాష్ట్రాలకి తీసుకువెళ్లాలని వేడుకుంటున్నారు. రెడ్ జోన్లో ఉండటం వల్ల భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ సంబంధిత శిక్షణ నిమిత్తం మహారాష్ట్రలోని షోలాపూర్ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు ఎంఎన్‌సీ కి వెళ్లారు. లాక్‌డౌన్‌కు ముందే శిక్షణ పూర్తైనట్టు తెలిపారు. ప్రస్తుతం వారంతా షోలాపూర్ జిల్లా సైపుల్ టౌన్‌లోని కళాశాలలోని క్వారంటైన్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడి అధికారులు ఏపీ అధికారుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారన్నారు. తమను రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: