కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో లోకకళ్యాణార్థం శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించారు. అయితే ముందుగానే అమ్మవారి దర్శనానికి భక్తులను రావద్దని మనవి చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తతో హోమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ రకాల పండ్లు, పూలు,హోమ ద్రవ్యాలతో పూజారులు మాస్కులు కట్టుకుని ఈ హోమాన్ని ఘనంగా జరిపించారు. ప్రతి శుక్రవారం భక్తులతో కిటకిటలాడే ఆలయం ఇప్పుడు బోసిపోయినట్లు కనిపించింది.
ఇవీ చదవండి