ETV Bharat / state

చౌడుభూములుగా మారుతున్న గోదావరి డెల్టా.. - latest news in west godavari district

పచ్చని వరి చేలతో అలరారే గోదావరి డెల్టా.. కాలుష్య కోరల్లో చిక్కుతోంది. సారవంతమైన ఆయకట్టు భూములు.. ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. నేల, నీరు, గాలి కలుషితమై.. డెల్టా మనుగడే దుర్భరమవుతోంది. ధాన్యరాశులు కురిపించే నేల.. చౌడుభూమిగా మారి సన్నకారు రైతులకు శాపంగా పరిణమిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికీ మేల్కోకపోతే.. వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Godavari deltas
గోదావరి డెల్టాలు
author img

By

Published : Jul 25, 2021, 5:15 PM IST

గోదావరి డెల్టాలు

రైతులతోపాటు దేశానికీ అధిక ఆదాయం తెచ్చేదిగా చెప్పుకొనే ఆక్వా రంగం... పెను విధ్వంసాన్నే సృష్టిస్తోంది. లక్షల ఎకరాలను నిస్సారంగా మారుస్తోంది. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా ధాటికి పచ్చని మాగాణి.. ఉప్పు నేలగా మారుతోంది. మూడు పంటలు పండే గోదావరి డెల్టా భూముల్లో.. గడ్డి మొలవని దురావస్థ దాపురించింది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో కుచించుకుపోతున్న డెల్టాను.. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మరింత దెబ్బతీస్తున్నాయి.

జిల్లాలో రొయ్యల చెరువుల తవ్వకాలపై నిషేధం ఉంది. నిర్దేశించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆక్వా చెరువులు తవ్వడమే వీటన్నింటికీ కారణమవుతోంది. రాజకీయ అండదండలతో ఇప్పటికీ ఇష్టానుసారం తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు అంటున్నారు. ఈ వేసవిలోనే సుమారు 22 వేల ఎకరాలకుపైగా డెల్టా భూములు ఆక్వా చెరువులుగా మారాయని అధికారులే చెబుతున్నారు. పాలకొల్లు, నరసాపురం, ఉండి, అత్తిలి, పెనుగొండ, వీరవాసరం, పెనుమంట్ర, పెరవలి, కాళ్ల, ఆకివీడు ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నాయి. భూములు లీజుకు తీసుకుని చెరువులు తవ్వేందుకు ప్రత్యేక మాఫియా తయారైందని రైతులు ఆరోపిస్తున్నారు. ముంపు ప్రాంతాలు, ఉప్పు నేలల్లో మాత్రమే ఆక్వా చెరువులు ఏర్పాటుచేయాలనే నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఆక్వా రంగం అన్నివిధాలా ఆదాయ వనరుగా ఉండటంతో.. వ్యవసాయం అంతగా కలసిరాని సన్నకారు రైతులు సారవంతమైన భూములను అమ్మేందుకు ముందుకొస్తున్నారు. ఇవేవీ పరిశీలించకుండానే జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ.. ఆక్వా చెరువులకు అనుమతులు ఇచ్చేస్తోంది. దరఖాస్తు పత్రంలో చేపలసాగు అని చెబుతూనే.. అనుమతులు వచ్చాక రొయ్యలు సాగు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో డెల్టా భూములు ఉండగా.. ఇందులో రెండున్నర లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులకు అనుమతులు ఉన్నాయి. అనధికారికంగా మరో లక్షన్నర ఎకరాల్లోనూ రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏటా 20 వేల నుంచి 30 వేల ఎకరాల్లో చేపల చెరువులు తవ్వుతున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండీ.. RRR: ఇప్పుడు పాఠశాలలు తెరిస్తే రాబోయే ఉపద్రవాన్ని ఊహించండి: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.