పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన కొనకళ్ల శ్రీనివాసరావు, భవాని దంపతులకు కుమార్తె శైలజ, కుమారుడు మహేష్ (14) సంతానం. శ్రీనివాసరావు ఉంగుటూరు శివారులోని కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చేలో వరి కోత యంత్రంతో కోత కోయిస్తుండగా.. వారితో పాటు కుమారుడు మహేష్ చేలో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో మహేష్ పాముకాటుకు గురయ్యాడు. హుటాహుటిన బాలుడిని ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఆస్పత్రిలో కొవిడ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అక్కడ సిబ్బంది చెప్పడంతో.. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ చెందాడు.
ఇదీ చదవండి: