పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో అమానవీయ ఘటన జరిగింది. గ్రామంలోకి రాకుండా...అదే గ్రామానికి చెందిన ఆరుగురిని పొలంలో క్వారంటైన్ చేశారు. గ్రామంలో రెడ్‌జోన్ విధించడం వల్ల, బయటి నుంచి వచ్చారనే వారిని రానీయలేదు. గ్రామానికి కిలోమీటరు దూరంలోని పొలంలో బెల్లంగానుగ షెడ్డులో వాళ్లను ఉంచారు.
గ్రామానికి చెందిన ఓ కుటుంబ ఉపాధి కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లారు. వీళ్లు... తిరిగి వచ్చేసరికి గ్రామంలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. దీనివల్ల గ్రామంలోకి రాకూడదని వాలంటీర్లు తెలిపారు. పొలంలో భోజన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధువులు సైతం భోజనాలు తీసుకురాకుండా నిబంధనలు విధించారన్నారు. అధికారుల ఆదేశాల వల్ల గ్రామంలోకి రాకూడదని.., వస్తే పోలీసు కేసులు పెడతామని అంటున్నారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికైనా తరలించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు గోదావరి నీటి విడుదల