ETV Bharat / state

బాలికపై లైంగిక దాడి.. యువకుడు అరెస్ట్ - west godavari district newsupdates

తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన వెల్లడించారు.

Sexual assault on a minor girl .. Arrest of a young man
మైనర్ బాలికపై లైంగిక దాడి.. యువకుడు అరెస్ట్
author img

By

Published : Jan 4, 2021, 4:23 PM IST

తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. డీఎస్పీ వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు ఆ గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆ ఇంటికి విద్యుత్ లైట్లు సరిగా పని చేయడం లేదని తల్లిదండ్రులు ఇంటి ఓనర్ దృష్టికి తీసుకెళ్లారు. యాజమాని స్థానిక లైన్ మేన్​కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ లైన్ మేన్ వద్ద ప్రైవేట్ ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్న నాగేంద్ర సాయి అనే యువకుడిని గత నెల 31వ తేదీ బాలిక ఇంటికి విద్యుత్ పని నిమిత్తం పంపారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో బాలిక సోదరితో కలిసి ఇంట్లో ఉంది.

విద్యుత్ సరిచేసేందుకు వచ్చిన నాగేంద్ర సాయి ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి.. తొమ్మిదేళ్ల మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులేసి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెప్పడానికి భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న బాలిక సోదరి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బాలికను పరిశీలించారు. శరీరంపై పలుచోట్ల గాయాలు ఉండటంతో 1వ తేదీ చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏలూరు దిశ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దిశ డీఎస్పీ సత్యనారాయణ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:

శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరుతూ శవంతో నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.