పాలకొల్లులో సీనియర్ వైద్యురాలు జిజియా గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఏడాది కిందటి వరకూ ఆమె వైద్యానికి ఒక రూపాయే తీసుకునేవారు. కొంతకాలం కిందట వైద్యం చేయడం మానేసేనాటికి 5 రూపాయలకు పెంచారు. నాటి ప్రముఖ వైద్యులు డా. సౌభాగ్యలక్ష్మి, మంగపతిరావు, విజయావాడ మాజీ మేయర్ డా. జంధ్యాల శంకర్, హృద్యోగ నిపుణులు డా.వెంకయ్య చౌదరి జిజియాకు సహాధ్యాయులే.
జిజియా చెన్నైలో వైద్య విద్యనభ్యసించారు. జిజియా నాన్న 1940లో విశాఖపట్నం వైద్యం చేసేవారు. ఆమె అన్న మల్లిఖార్జునరావు తూర్పు గోదావరి డీఎంహెచ్వోగా పనిచేశారు. జిజియా బహుముఖ ప్రజ్ఞాశాలి. చిత్రకారిణి, సంగీతంలో ప్రావీణ్యురాలు. ఆమె రచనలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇదీ చదవండి: