పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మహిళా యాచకులను భద్రతా సిబ్బంది మోకాళ్లపై కూర్చోబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. శివాలయం సమీపంలో నలుగురు మహిళా యాచకులను అక్కడి భద్రతా సిబ్బంది మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఆరుబయట ఎండలో ఇలా కూర్చోబెట్టడం చర్చనీయాంశమైంది. ఆలయానికి వచ్చే భక్తులను ఇబ్బందులు పెడుతున్నారన్న కారణంగా వారిని హెచ్చరించి పంపించినట్లు దేవాలయ భద్రతా సిబ్బంది అంటున్నారు. కానీ.. యాచకులు మాత్రం తాము వెళ్లిపోతామని చెప్పినప్పటికీ తమను కొట్టారని.. కర్రతో బెదిరించారని వాపోతున్నారు.
ఇదీ చదవండి:
Solvent leak on Road: రోడ్డుపై లీకైన సాల్వెంట్.. 7 గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది