ETV Bharat / state

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం.. - west godavari district

విజయవాడనుండి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూరేళ్లగూడెం జాతీయ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ ​స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది.

rtc bus accident happend at koorellagudem national highway in west godavari district. fourteen people were injured in the accident.
author img

By

Published : Aug 27, 2019, 8:30 AM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కూరేళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. 42 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి..డివైడర్ మీదకు దూసుకువచ్చింది. అనంతరం అక్కడున్న విద్యుత్ స్తంభం, చెట్టును ఢీకొంటూ..ప్రైవేట్ ట్రావెల్ బస్సుపైకి దూసుకెళ్లింది. వెంటనే ప్రైవేట్ బస్సు డ్రైవర్ అప్రమత్తమై ఎడమవైపుకు తిప్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆంజనేయులు ,ప్రైవేట్ రాయల్ బస్సు క్లీనర్ సత్తిబాబు , నిడమర్రు మండలం బొమ్మనపల్లికి చెందిన మేడపాటి భరత్ రత్నకుమారి రాజు వదిన, బండి భవాని (సినీ దర్శకుడు బండి భాస్కర్ భార్య)తో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం..

ఇదీచూడండి.ముథోల్​లో విషాదం... ఆటోబోల్తా పడి విద్యార్థిని మృతి

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెంకన్న ఆలయం భక్తులతో పోటెత్తింది .స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.

Body:ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించు కుంటున్నారు .ఉదయం నుంచే స్వామివారి దర్శనం క్యూలలో ,ప్రసాదాల కౌంటర్ వద్ద బారులుతీరారు. ఉదయం నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు .శ్రీవారి కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి .సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది .భక్తులకు దేవస్థానం అధికారులు అల్పాహారాన్ని, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. చిన్న పిల్లలకు స్వామివారి క్షీర ప్రసాదాన్ని అందజేశారు .వృద్ధులకు, చంటి బిడ్డ తల్లి లకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

Conclusion:భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.