ఇదీ చూడండి:
పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి - గండిగూడెంలో రోడ్డు ప్రమాదం న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం గండిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బొర్రంపాలెం గ్రామానికి చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు బందంచర్లలో విద్యార్థులను ఎక్కించుకుని గండిగూడెం గ్రామానికి చేరుకుంది. అదే సమయంలో కొక్కొండ పార్థు అనే బాలుడు రహదారిపైకి వచ్చాడు. అధిక వేగంతో వచ్చిన బస్సు ప్రమాదవశాత్తు బాలుణ్ని ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి
Reporter. Nagaraju.Centure. Chintalapudi.Fele. Ap_tpg_10_24_accident_avb__ap10182 .యాంకర్ వాయిస్..పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం గండిగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన కొక్కొండ పార్థు (7) ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి మృతి చెందాడు. వాయిస్ ఓవర్... పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం గండిగూడెం గ్రామంలో శుక్రవారం ఉదయం అదే మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన gnr ప్రైవేటు పాఠశాల బస్సు బందంచర్లలో విద్యార్థులను ఎక్కించుకుని ఉదయం ఏడు గంటలకు గండిగూడెం గ్రామానికి చేరుకుంది. ఆ సమయంలో కొక్కొండ కృష్ణాచారి కుమారుడు పార్థు రహదారిపైకి వచ్చాడు. పాఠశాలకు చెందిన బస్సు అధిక వేగంతో బాలుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఇంటి వద్ద ఉంటున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. అన్యాయంగా తమ కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు విలపించారు నోట్..విజువల్ వాట్సాప్ లో పంపాను పరిశీలించగలరు.1. గ్రామస్తుడు.2. బాలుడి తండ్రి.3. బాలుడి అన్నయ్య.