పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లులో అజిత్రోమైసిన్ పేరుతో విక్రయిస్తున్న వివిధ రకాల మాత్రలను అధికారులు పరీక్షించారు. వాటిలో ప్రమాణాలకు తగ్గట్లు నాణ్యత లేదని వెల్లడైంది. అప్రమత్తమైన అధికారులు... కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఔషద దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 3 లక్షల రూపాయలు విలువైన మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. మందుబిళ్లల ప్యాకింగ్‌పై ఉన్న వివరాల ఆధారంగా ఉత్తరాఖండ్‌లోని పరిశ్రమల్లో విచారించేందుకు ఔషద నియంత్రణ శాఖ అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ.. రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదు