పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావుతో కలిసి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే ముఖ్యమని మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. ధాన్యం కొనుగోలు చేసేందుకు నూతన ప్రక్రియ అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో ఉండే వ్యవసాయ సహాయకుని వద్ద రైతులు నమోదు చేసుకుంటే.. సహాయకులే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందిస్తారన్నారు.
'ఇతర రాష్ట్రాల ధాన్యం నిలిపేశాం'
ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల మిల్లర్లకు రైతులకు మధ్య అనుసంధానకర్తలుగా పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుబడి వస్తే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు తగ్గుతుందనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల దిగుమతులను నిలిపివేసినట్లు మంత్రి ప్రకటించారు. వరితో పాటు మొక్కజొన్న తదితర పంటలను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీ చదవండి: