పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పర్యటించారు. రేపు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో శంకుస్థాపనలు చేశాక నిధులు విడుదల చేసేవారని దాని వల్ల పనులు జరిగేవి కావన్నారు. ఇప్పడు నిధులు విడుదల చేశాక శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తుతోందని స్పష్టం చేశారు.
ఇదీచదవండి