రేషన్ బియ్యం అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది.. పశ్చిమగోదావరి, విశాఖలో కలిపి 30 టన్నుల బియ్యం ఉన్న వాహనాల్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారంటేనే అర్ధమవుతుంది. పశ్చిమ గోదావరి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తనిఖీ చేయగా సుమారు 3.50 లక్షల బియ్యం ఉన్నాయి. కాగా విశాఖలోనూ ఇదేమాదిరి ఇంట్లో దొరికాయి. గ్రామాల్లో సేకరించి భారీగా పోగు చేసి, మిల్లులకు తరలించి పొర తొలగించి అధిక ధరలు అమ్మకాలు చేస్తారని పట్టుబడిన వారు పేర్కొన్నారు.. ఈ వాహనాల్ని సీజ్ చేసి బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి:గోదావరి పరవళ్లు... పోలవరంలో వరద ప్రవాహం