Encroachments Removed : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆక్రమణలను రైల్వే ఉన్నతాధికారులు తొలిగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్పీఎఫ్, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఏళ్ల తరబడి రైల్వే స్థలంలో ఆక్రమణలు ఉండిపోవడంతో వాహనదారులకు, ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని పోలీసులు తెలిపారు. గతంలో ఆక్రమణలు తొలిగించడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టిన.. బాధితులు న్యాయస్థానంను ఆశ్రయించడంతో అప్పుడు నిలిచిపోయింది.
కొన్నేళ్లక్రితం వీటిని మళ్లీ తొలగించే ప్రయత్నం చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు.. బాధితులకు అండగా నిలిచారు. దీంతో వీటి తొలగింపు మధ్యస్థంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం న్యాయస్థానం రైల్వేకు క్లియరెన్స్ ఇవ్వడంతో ఆక్రమణల తొలగింపునకు అధికారులు సన్నద్ధమయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణదారులకు ఇటీవలే సమాచారాన్ని అందించారు.
ఆక్రమణలు తొలగించడానికి సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు అవకాశం ఇచ్చామని, రైల్వేస్టేషన్ అభివృద్ధి దృష్యా రోడ్డు విస్తరించాల్సి ఉందని తెలిపారు. నక్లెస్ రోడ్డు నుంచి స్టేషన్ రోడ్డు వరకు సుమారు 100 మీటర్లకు వరకు ఆక్రమణలు ఉన్నాయి. జిల్లాలోని రైల్వే స్థలాల్లో ఆక్రమణాలన్ని ఇప్పటికే తొలగించగా.. నరసాపురం ఒక్కటే పెండింగ్లో ఉంది. దీంతో ఈ ఆక్రమణలు తొలగించారు. ఈ రహదారి అభివృద్ధి పనులు చేపట్టడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టనుంది.
ఇవీ చదవండి: