రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బంద్ కొనసాగుతోంది. జీవో నెంబర్ 3 రద్దు వల్ల గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బంద్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ, గిరిజన సంఘాలు పాల్గొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూయించి వేశారు.
ఇదీ చదవండి: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం