Priest Murdered in AP: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వరావును గుర్తుతెలియని వ్యక్తులు గుడి లోపలే హత్య చేశారు. అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు ఆయన భార్య సమాచారం అందించారు. పూజారి ఆచూకీ కోసం రాత్రి ఆలయం వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు.. బయట ఆయన వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.
సొంత పొలం వద్ద కూడా పూజారి ఆచూకీ లేకపోవడంతో పని మీద వేరొక ఊరికి వెళ్లి ఉంటారని భావించారు. తెల్లవారుజామున ఆయన కోసం గాలించిన కుటుంబసభ్యులు.. ఆలయ ఆవరణలోనే రక్తపు మడుగులో ఆయన మృతదేహం పడి ఉండటాన్ని గమనించినట్టు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు మృతుడి అల్లుడు తెలిపారు.
ఇదీ చదవండి:
Crime News in AP: ఇద్దరు మైనర్లు, ఇద్దరు మహిళలపై అఘాయిత్యాలు.. ఒకరు అరెస్టు