పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సీఐ మల్లేశ్వరరావు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా రహదారిపై తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఎక్కువ మంది యువకులు రహదారిపైకి రావడంతో.. వారి ద్విచక్ర వాహనాలను స్టేషన్కు తరలించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కరోనాను అరికట్టేందుకు అహర్నిశలూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:
విద్యుత్ వాహన రంగానికి రూ.18వేల కోట్లు!
రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్