పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఎటువంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.5.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు. టీ.నర్సాపురం మండలం బండివారిగూడేనికి చెందిన నాలం నారాయణరావు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: 'నా ఓటెక్కడ..?' డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు మిస్సింగ్