ETV Bharat / state

సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. నలుగురి అరెస్టు

author img

By

Published : Jun 18, 2020, 8:01 PM IST

మద్యం ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో సారా తయారీ స్థావరాలు పుట్ట గొడుగుల్లా వెలిశాయి. అక్రమంగా సారా తయారు చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేసి భారీగా సారాను స్వాధీనం చేసుకున్నారు.

Police raids on Natusara manufacturing plants and four people arrested in west godavari district
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. నలుగురు అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పోలవరం మండలం ఎల్​ఎన్​డీ పేటలో తనిఖీలు నిర్వహించి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 310 లీటర్ల సారాతో పాటు 1800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని సీఐ సత్యనారాయణ తెలిపారు. సారా తరలిస్తున్న వ్యక్తితో పాటు, బెల్లం సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం పరిధిలో సారా, తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ అజయ్​కుమార్​సింగ్ తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి. వేదాద్రి మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.