Rooster Knives: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం గ్రామంలో.. 1310 కోడి కత్తులు వాటిని పదునుపెట్టే యంత్ర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.91 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పండగ రోజుల్లో కోడిపందాలకు కొత్తగా కత్తులు తయారు చేసి.. అధిక మొత్తంలో ఆదాయం సంపాదించాలనే ఆలోచనతో నిందితుడు కత్తులు తయారు చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు.. గెలుపు పందెంరాయుళ్లదా.. పోలీసులదా..?