Power cuts: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో.. ప్రభుత్వాసుపత్రిలో రోగులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుకు.. దాదాపు 5 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తుండటం వల్ల ప్రభుత్వాసుపత్రిలో.. బాలింతలు, చిన్నారులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అత్యవసర సమయాల్లో యంత్రాలు పనిచేయకపోవడంతో రోగుల కష్టాలు వర్ణణాతీతంగామారాయి. గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు.
ప్రసూతి వార్డుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు సెల్ ఫోన్లు, టార్చ్ లైట్ వెలుతురులో కాలం గడుపుతున్నారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిల్లో జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ డీజిల్ కొరత, ఇతర కారణాల వల్ల అవి పని చేయడం లేదు. దీంతో రాత్రి వేళల్లో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిల్లో కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: