ETV Bharat / state

నట్టేట లంక గ్రామాలు... ఇక్కట్లలో ప్రజలు, పశువులు

గోదావరి వరద ఉద్ధృతితో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేల ఎకరాలు నీట మునిగి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నట్టేట మునిగిన లంక గ్రామాలు...ఇక్కట్లలో ప్రజలు
author img

By

Published : Aug 6, 2019, 9:25 AM IST

నట్టేట మునిగిన లంక గ్రామాలు...ఇక్కట్లలో ప్రజలు

గోదావరి వరదలు.. తూర్పు గోదావరి జిల్లాలోని లంకగ్రామలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దేవీపట్నం మండలం పరిధిలోని 32 గ్రామాలు కొద్ది రోజులుగా జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం, మామిడికుదురు, కొత్తపేట మండలాలు ముంపునకు గురయ్యాయి. వీటి పరిధిలోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రహదారులపై పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. నడుము లోతు నీళ్లల్లోనే ప్రజలు దినచర్య కొనసాగిస్తున్నారు.

రైతుల కన్నీరు

గోదావరి ఉగ్రరూపం రైతులకు శాపంగా మారింది. సుమారు 1500 ఎకరాల్లోని కూరగాయల పంటలు నీట మునిగాయి. పంట చేతికందే సమయంలో వరదతో తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లో పశువుల పరిస్థితి దయనీయంగా మారింది. గడ్డి, దాణా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. మరోవైపు.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొంతవరకూ సదుపాయాలు ఏర్పటు చేశారు. పశువులపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి

కశ్మీర్​ అంశంపై నిపుణుల్లో భిన్న స్వరాలు

Intro:Ap_Nlr_05_05_Corporation_Dhadulu_Kiran_Avbb_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో ఆహార కల్తీ నియంత్రణ, కార్పొరేషన్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు హోటల్స్, కూల్ డ్రింక్ షాప్ లను అధికారులు తనిఖీలు చేశారు. హోటల్స్ లో ఇంకా నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలతోపాటూ అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి జరిమానా విధించారు. విఆర్సి సెంటర్ వద్ద రెండు శీతలపానీయాల దుకాణాలను అధికారులు పరిశీలించారు. ఈ దుకాణాలలోనూ అపరిశుభ్ర వాతావరణం తోపాటు కుళ్లిన పండ్లతో పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పానియాలను నిర్వీర్యం చేసే తాత్కాలికంగా దుకాణాలను మూయించారు.
బైట్: శ్రీనివాస్, ఆహార కల్తీ నియంత్రణ అధికారి, నెల్లూరు.
వెంకటరమణ, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.