PAWAN: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ఇంతలో పవన్ కల్యాణ్ అభిమాని ఒక్కసారిగా పవన్‌ను ఎత్తు కొనేందుకు, కౌగిలించుకునే ప్రయత్నం చేయడంతో సిబ్బంది అప్రమత్తమైయ్యారు. అనంతరం అక్కడ నుంచి అతడిని బయటికి పంపించారు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ను.. ఉండి తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు సత్కరించారు. ఇందులో పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: