ETV Bharat / state

పరిషత్ పోరు.. అభ్యర్థుల దూకుడు - పరిషత్ ఎన్నికలకు మోగిన నగారా

పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగానే... పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేవలం 7 రోజుల వ్యవధిలో ఎన్నికలు జరిగేలా షెడ్యూల్ జారీ కావడం... రాజకీయ శిబిరాలను సందడిగా మార్చింది.

PARISHAT ELECTIONS
PARISHAT ELECTIONS
author img

By

Published : Apr 3, 2021, 12:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జడ్పీటీసీ స్థానాలు, 863 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2 జడ్పీటీసీ, 73 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో ఒక జడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివిధ కారణాలతో మరణించగా.. అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 45 జడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఓటర్లు ఇలా..

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే పరిషత్ ఎన్నికలకు 23 ,76, 756 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 11,99,699 మంది మహిళా ఓటర్లు, 11,76,914 మంది పురుషులు, 143 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.

బరిలో అభ్యర్థులు..

ఎన్నికలు జరిగే ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలు పార్టీల వారీగా..

  • వైకాపా - 786
  • తెలుగుదేశం - 688
  • కాంగ్రెస్ - 42
  • జనసేన - 245
  • సీపీఐ - 9
  • సీపీఎం - 27
  • భాజపా - 119
  • బీఎస్​పీ - 10
  • జనసేన - 245
  • ఇతరులు - 145

మొత్తంగా.. 2071 మంది పోటీలో ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన వారిలో మరణించిన వారి వివరాలు తెలిసిన తరువాత.. బరిలో ఉండే వారి వివరాలను అందిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

బంగాల్​లో మోదీ, దీదీ 'స్వీటు' విగ్రహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.