ETV Bharat / state

ఎక్కడా తగ్గట్లేదు.. ప్రచారానికి సోషల్ మీడియాలో సై

అభ్యర్థి పేరుపై.. వాట్సాప్ గ్రూప్.. పార్టీ పేరుపై మరో గ్రూపు. అన్నొస్తున్నాడూ.. అంటూ పాటలు.. ఫేస్​బుక్​లో ఓటేయాలంటూ.. ప్రచారం.. పంచాయతీ ఎన్నికలంటే ఇప్పుడు మారాయి. అభ్యర్థుల ప్రచార తీరు మారింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గకుండా అభ్యర్థులు ఊర్లలో ప్రచారం జోరు చూపిస్తున్నారు.

ఎక్కడా తగ్గట్లేదు.. ప్రచారానికి సోషల్ మీడియాలో సై
ఎక్కడా తగ్గట్లేదు.. ప్రచారానికి సోషల్ మీడియాలో సై
author img

By

Published : Feb 3, 2021, 6:09 PM IST

పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం తీరు మారుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటు అడగడమే కాదు. ఏ మాత్రం ఇమేజ్ తగ్గకుండా.. అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. ఇక్కడ.. అక్కడ అని లేదు.. ఎక్కడ పడితే అక్కడే.. తమకే ఓటేయాలంటూ.. జోరు పెంచుతున్నారు.

ఫేస్ బుక్, వాట్సాప్ వేదికగా ఎన్నికల సమరానికి మద్దతు సమీక్షిస్తున్నారు అభ్యర్థులు. రాజకీయ పార్టీల మద్దతు పొందిన అభ్యర్థులు సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో సమాచారాన్ని తెలియజేసి ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఊర్లలో వాట్సాప్, ఫేస్​బుక్​ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా కరోనా ముప్పు తొలగకపోవడంతో ప్రతి ఓటరును సామాజిక మాధ్యమాల వేదికగా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే ఓటేయాలంటూ.. పాటలు రూపొందిస్తూ.. గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు.

ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లు విద్య, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డ వారిని.. డిజిటల్ మీడియా వేదికగా అభ్యర్థులు చేరుకుంటున్నారు. సర్పంచ్​గా పోటీ చేస్తున్నాను.. అని విధాలుగా సహకరించాలని.. ఎన్నికల రోజు ఊరికి వచ్చి ఓటేయాలని పోస్టులు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.