పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మరోవైపు భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా కలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వారంతా ఘనంగా నిర్వహించారు.
పలకరింపులు, కుశల ప్రశ్నలు, నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దీంతో ఆయా పాఠశాలల ప్రాంగణాల్లో పండగ వాతావరణం నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.