తాతయ్యకు విమానంలో ప్రయాణించడమంటే ఇష్టమని తెలుసుకున్న మనవరాలు, మనవళ్లు.. ఆయన పుట్టిన రోజున విమాన ప్రయాణం చేయించి గొప్ప అనుభూతిని పంచారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన రొంగల రాముడు వయసు 101 ఏళ్లు. ఆయన పుట్టినరోజున గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని నిర్ణయించిన మనవళ్లు, మనవరాలు.. 12 నిమిషాలు గగన విహారం చేయించారు. దీంతో రాముడు ఆనందడోలికల్లో మునిగిపోయారు.
గుర్తుండిపోయే బహుమతి
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన రొంగల రాముడు వయస్సు 101 సంవత్సరాలు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారు. ఆయన మనవరాలు అపురూప, మనవడు అరవింద్ బెంగళూరులో ఉంటున్నారు. ఆయన 101వ పుట్టినరోజుకు గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు. ఆయనను.. బెంగళూరు తీసుకువెళ్లి అక్కడి జక్కూరు ఎయిర్ డ్రోంకు తీసుకెళ్లారు. రెండు సీట్ల ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకుని.. రొంగల రాముడిని పైలెట్ పక్కన కూర్చోబెట్టారు. ఆకాశంలో 12 నిమిషాల పాటు విమానయానం చేశారు. వందేళ్లు దాటిన వయసులో.. తన వారసులు ఇచ్చిన బహుమతి చూసి ఆ పెద్దాయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మనవరాలు అపురూప.. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి కోడలు.
ఇదీ చదవండి:
COMPLAINT: జోగి రమేశ్ డ్రైవర్ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు