పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ఎన్నికలు జరిగే పంచాయతీల్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి. పార్టీ నాయకుల విగ్రహాలు కనిపించకుండా ముసుగులు వేయాలి.
ఎలక్షన్ కోడ్ను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పరిధిలోని అధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు వంటి ప్రాంతాల్లో చాలాచోట్ల.. ఇవేవీ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.
ఇదీ చదవండి: