పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామంలో ఆదివాసీల అకాలమరణాల పై ఈటీవీ భారత్, ఈనాడు కథనాలకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్న కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. కాళ్ళ వాపులు, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్న ఆదివాసీలను సమీపంలోని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో దొరికే వాగులో నీరు ప్రజలు తాగనీయకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. ట్యాంకర్ ద్వారా శుద్ధి నీటిని అందజేశారు. ఆదివాసీల గూడెంలో గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ద్వారా బోరును వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గిరిజనులకు నిత్యావసర సరుకులను అందజేశారు.
ఇదీ చూడండి: