పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రవాసాంధ్రులు ఉదారతను చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వికలాంగ మహిళ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. ఆచంటకు చెందిన చదలవాడ కుమారి, లాజర్ భార్యాభర్తలు. లాజర్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ఆమె రెండు కాళ్లు పోగొట్టుకుంది. ఆమె ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరి గురించి తెలుసుకున్న గొడవర్తి స్వప్న, ముకుంద్ అనే ప్రవాసాంధ్రులు.. వారు నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షా 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బాధిత మహిళకు అందజేశారు.
ఇవీ చదవండి