ఉంగుటూరు నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా గన్ని వీరాంజనేయులు వేలాది కార్యకర్తలతో అట్టహసంగా నామినేషన్ వేశారు. దెందులూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా కోటార్ అబ్బయ్య నామినేషన్ పత్రాలు ఆర్ అంబేద్కర్ అందజేశారు. అదే నియోజకవర్గానికి.... భాజపా అసెంబ్లీ అభ్యర్థిగా యలమర్తి బాలకృష్ణ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, జనసేన అభ్యర్థిగా ఘంటసాల వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నియోజకవర్గ టిక్కెట్‌ని మహిళలకు కేటాయించిన పవన్ కల్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ నియోజవర్గంలో నామినేషన్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇద్దరు ఒకేసారి నామినేషన్ కార్యాలయానికి చేరుకోవడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ గందరగోళంలోనే తెదేపా అభ్యర్థి రామరాజు, వైకాపా అభ్యర్థి పీవీ నరసింహరాజు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి:వేలాది అభిమానుల తోడుగా జనసేనాని నామినేషన్