ETV Bharat / state

నవరాత్రి ఉత్సవాలు.. మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ - పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దసరా నరరాత్రిలో భాగంగా గోస్తనీనది తీరాన ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారు మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిస్తున్నారు. . పలువురు దంపతులు అమ్మవారికి ముత్యాలతో అభిషేకం చేశారు.

నవరాత్రి ఉత్సవాలు.. మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ
author img

By

Published : Oct 7, 2019, 1:10 PM IST

నవరాత్రి ఉత్సవాలు.. మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున కనకదుర్గమ్మ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందని భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి సాముహిక కుంకుమ పూజాలు నిర్వహించారు. పలువురు దంపతులు అమ్మవారికి ముత్యాలతో అభిషేకం చేశారు.

ఇదీ చదవండి:శ్రీ మహిషాసురమర్దినిగా..బెజవాడ దుర్గమ్మ

Intro:ap_tpg_81_7_bhavanilapadayatra_ab_ap_10162

Body:విజయదశమి దగ్గర పడడంతో అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే భవానీలు పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు. విజయనగరం , శ్రీకాకుళం , విశాఖపట్నం , తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న భవాని లతో 16వ నెంబర్ జాతీయ రహదారి ఎరుపు రంగు సంతరించుకుంది. పాదయాత్రగా వెళ్తున్న భవానీ లకు పలు ప్రాంతాల్లో అల్పాహారం మధ్యాహ్న భోజన ఏర్పాట్లను స్థానిక దాతలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం విజయనగరం నుంచి బయలుదేరిన భవానీలు దాదాపు 12 రోజులుగా పాదయాత్ర చేస్తూ వస్తున్నారు వర్షం కారణంగా పలు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అన్నారు. అమ్మవారి పై భారం వేస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.