ETV Bharat / state

'మానసిక ప్రశాంతతకు ధ్యానం అవసరం' - తణుకులోని పలు అభివృద్ధి పనులకు నరసాపురం ఎంపీ కనుమూరి శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పలు అభివృద్ధి పనులకు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు శ్రీకారం చుట్టారు. ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. మారుతున్న కాలానికి తగినట్టుగా.. మరిన్ని ధ్యాన కేంద్రాల అవసరం ఉందన్నారు.

Narasapuram MP Kanimuri Raghuramakrishnan Raju has been involved in many development projects in thanuku West Godavari district.
తణుకులోని పలు అభివృద్ధి పనులకు నరసాపురం ఎంపీ కనుమూరి శ్రీకారం
author img

By

Published : Feb 27, 2020, 10:08 AM IST

తణుకులోని పలు అభివృద్ధి పనులకు నరసాపురం ఎంపీ కనుమూరి శ్రీకారం

నిధుల కొరత ఉన్నా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అందరి సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నారని నరసాపురం లోక్ సభ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరిజిల్లా తణుకులో.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి 2 కోట్ల 88 లక్షల 75 వేల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాలగంగాధర తిలక్‌ ఆడిటోరియంను ఆధ్యాత్మిక కేంద్రంగా ఆధునీకరించే పనులకు శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలోనే మొదటిసారిగా చేపట్టామని ఆయన వెల్లడించారు. ధ్యాన ప్రక్రియకు ప్రస్తుతం అవసరం పెరిగిందని, మానసిక ప్రశాంతతకు ఇలాంటి కేంద్రాల అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. తణుకులోని కేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ధ్యాన కేంద్రాలను నిర్మించేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

నేడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.