పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉన్న ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. తమకు రావాల్సిన వేతనాల కోసం యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... ఏమాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందారు. తమకు 2 నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వేతన బకాయిల తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి క్యూ కట్టిన విద్యార్థులు.. దర్శనమిస్తున్న 'నో అడ్మిషన్' బోర్డు