అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరం రావాల్సి ఉన్న తాను పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరంలో ఉన్న తన అనుచరులతో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు బైండోవర్ల పేరిట స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని రఘురామ ఆరోపించారు. తర్వాత పిల్లల తల్లిదండ్రులతో తనకు ఫోన్ చేయించి తాను కార్యక్రమానికి రాకుండా ఉంటే వాళ్లని వదిలేస్తామని చెప్పారని...రఘురామ తెలిపారు. అందువల్ల తాను బేగంపేట స్టేషన్‌లో దిగిపోతున్నట్లు చెప్పిన ఎంపీ.....పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అనంతరం హైదరాబాద్‌లోని తన ఇంటికి రఘురామకృష్ణరాజు వెళ్లిపోయారు.
సోమవారం భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఎంపీ రఘురామరాజు గతంలోప్రకటించారు.
ఇదీ చదవండి: పీఎంవో జాబితాలో రఘురామ పేరు లేదు.. చట్టప్రకారం వ్యవహరిస్తాం : డీఐజీ