భాజపా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. భీమవరంలో జులై 4న జరుగనున్న ప్రధానమంత్రి మోదీ సభలో ప్రత్యేక హోదా కోసం కనీసం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని ఆ ప్రాంతవాసులకు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను భాజపా ప్రభుత్వం అమ్మేస్తుందని విమర్శించారు. పెదఅమిరం గ్రామంలో నిర్వహించిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారని రవీంద్ర బాబు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును అమ్మి.. మోదీకి భీమవరానికి వచ్చే దమ్ము ఉందా..? అని నిలదీశారు. ఆనాడు విభజన సమయంలో ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని అడిగిన బాజాపా నాయకులు.. ఇప్పుడు ప్రత్యేక హోదా మాటను మర్చిపోయారన్నారు. అటు భాజపా , ఇటు జనసేన పార్టీలకు ఆంధ్రాలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు.