పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్, పంచాయతీ అధికారులతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నా అనేక మంది అక్రమార్కులు డీడీలు తియ్యకుండా దొంగచాటుగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలో కొన్ని పంచాయతీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే రెవెన్యూ పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి...